![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో సండే అంటేనే సరదాగా గడిచిపోతుంది. అలాంటి సరదాలతో పాటుగా సంచులకొద్ది పంచులు వేసే ఆది వస్తే ఆ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఆది పంచులకి కడుపుబ్బ నవ్వుకున్నాడు నాగార్జున.
దీపావళి రోజు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు మాత్రం ఆది మాటలు, పంచులు మంచి కిక్ ఇచ్చాయి. రాగానే మొదటగా ఆది, ఫైమా తో కామెడీ మొదలెట్టాడు. "ఫైమా, ప్రవీణ్ నిన్ను అడుగమన్నాడు" అని అనగా, దానికి రిప్లై గా ఫైమా "నేను కూడా అడిగానని చెప్పు" అంది. "నిన్ను కాదు. నీకు పదివేలు ఇచ్చాడంట కదా, అవి అడగమన్నాడు" అని అనగానే అందరు పగలబడి నవ్వారు. ఆ తర్వాత శ్రీసత్య గురించి మాట్లాడుతూ, "రాత్రి పది అయితే చాలు. కుర్రాళ్ళు అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు నిన్ను చూడటానికి" అని అనగా, "ఓహో థాంక్స్" అని అంది శ్రీసత్య. ఆ తర్వాత పాపం ఆ అర్జున్ కి ఏదో ఒకటి చెప్తే అని అంటూండగానే, అది అవ్వదు అని అనేసింది శ్రీసత్య.
తర్వాత " ఎవ్వరైనా కానీ, ఏమైనా కానీ నీ అవ్వ తగ్గేదేలే అని , భయ్యా నువ్వు 'పుష్ప' లో 'అల్లు అర్జున్' లానే చెప్పావ్, మాకేమో 'ఒక్కడు' లో 'ప్రకాష్ రాజ్' లా అనిపించింది అని రేవంత్ తో అనగానే అందరు నవ్వారు. ఆ తర్వాత శ్రీహాన్ తో, "ఇనయా, శ్రీహాన్ కలిసి ఉండేదానికంటే గొడవపడి విడిపోతే వచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ" అని అనగా, "వాయమ్మో మళ్ళీ మొదటికి వచ్చేస్తాం" అని శ్రీహాన్ నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత "ఉండాలి మామ నువ్వు ఉండాలి మామ అని మొదలుపెట్టి, ఆదిరెడ్డి నీకు భయమంటే ఏంటో తెలియదు కదా, ఒక్కసారి బయటకొచ్చాక హాట్ స్టార్ లో నీ డ్యాన్స్ చూసుకో భయపడతావ్" అని చెప్పాడు. ఆ తర్వాత ఇనయా నేనేమైనా మార్చుకోవాలా అని అనగా, "ఇలా ఒక్కొక్కరుగా మార్చకుండా ఉంటే బాగుంటుంది" అని అన్నాడు. ఇలా ఆది పంచులకి హౌస్ మేట్స్ తో పాటు, ప్రేక్షకులకు మస్త్ ఎంటర్టైన్మెంట్ లభించింది.
![]() |
![]() |